కాంగ్రెస్ నిబంధనలు ఉల్లంఘిస్తోంది: బిజెపి
హైదరాబాద్: కాంగ్రెస్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తోందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకులు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎ.వి.యస్. రెడ్డికి ఫిర్యాదు చేశారు. బిజెపి రాష్ట్రాధ్యక్షుడు ఎన్. ఇంద్రసేనారెడ్డి, జాతీయ కార్యదర్శి బండారు దత్తాత్రేయ తదితరులు గురువారంనాడు ఎ.వి.యస్. రెడ్డిని కలిసి ఆ మేరకు ఫిర్యాదు చేశారు. కొత్త రేషన్ కార్డులు పంచుతూ కాంగ్రెస్ ఎన్నికల నిబంధలను ఉల్లంఘిస్తోందని వారు విమర్శించారు. అనంతపురంలోనూ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తోందని వారు ఆయన దృష్టికి తెచ్చారు. ఎన్ని అవకతవకలకు పాల్పడైనా సరే ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఇంద్రసేనారెడ్డి విమర్శించారు.
రేషన్‌కార్డుల పంపిణీ ఫిర్యాదుపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని ఎ.వి.యస్. రెడ్డి బిజెపి నాయకులకు హామీ ఇచ్చారు. కొత్త రేషన్‌కార్డులు ఇవ్వడం ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమేనని, అది నిజమైతే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే ఎటువంటి చర్యనైనా నిబంధనలకు వ్యతిరేకమేనని ఆయన అన్నారు.
రేషన్‌కార్డుల పంపిణీని నిలిపివేయాలని ఎన్నికల కమీషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.












Click it and Unblock the Notifications
