ఓపిక ఉండాలి: కెసిఆర్‌కు కెకె సలహా
హైదరాబాద్: ఉద్యమాలు చేసేవారికి ఓపిక ఉండాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్) నేత కె. చంద్రశేఖర్‌రావును ఉద్దేశించి అన్నారు. ఇంతకు మించి వ్యవహరిస్తే బ్లాక్‌మోయిల్ చేయడం అవుతుందని ఆయన అన్నారు. ఉద్వేగం వల్ల లాభం ఉండదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణను కలిసి పోరాడి సాధించాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. తాను చంద్రశేఖర్‌రావును విమర్శించాలని మాట్లాడడం లేదని ఆయన అన్నారు. వాస్తవాలు చూడాలని మాత్రమే తాను కెసిఆర్‌కు సూచిస్తున్నానని ఆయన అన్నారు.
రాజకీయాల్లో విలువలను నిలబెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పరస్పర విమర్శలు చేసుకుందామని, అయితే ఈ విషయంలో నీచంగా వ్యవహరించడం మంచిది కాదని, ఒక రాజకీయ సంప్రదాయాన్ని సృష్టిద్దామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
