వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మోసం చేయడం బాబుకు అలవాటే: ఇంద్రసేన్
హైదరాబాద్: తమ పార్టీపై విమర్శలు చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు ఎన్. ఇంద్రసేనా రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. నమ్మినవారిని మోసం చేయడం చంద్రబాబుకు అలవాటేనని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. హిందువులను వ్యతిరేకించడమే సెక్యులరిజమా అని ఆయన చంద్రబాబునుద్దేశించి ప్రశ్నించారు.
1999లో పొత్తుకు అడ్డురాని తమ పార్టీ సిద్ధాంతం ఇప్పుడు అడ్డు వచ్చిందా అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. తమ పార్టీ నాయకులుగా అప్పుడున్నవారే ఇప్పుడూ ఉన్నారని, తమ సిద్ధాంతం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ మారలేదని ఆయన చెప్పారు. మజ్లీస్ సెక్యులర్ పార్టీయో, మతతత్వ పార్టీయో చంద్రబాబు చెప్పాలని ఆయన అడిగారు. తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతమంటూ లేదని ఆయన విమర్శించారు. గుజరాత్ అల్లరను ఖండించే పార్టీలు గోద్రా దుర్ఘటనను ఎందుకు ఖండించవని ఆయన ప్రశ్నించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!