తమిళ నటుడు ప్రశాంత్ వివాహం
చెన్నై: తమిళ నటుడు ప్రశాంత్ గురువారంనాడు చెన్నైకి చెందిన ఒక వ్యాపారి కూతురి మెడలో మూడు ముళ్లు వేశాడు. ప్రశాంత్ ప్రముఖ నటుడు త్యాగరాజన్ కుమారుడు. వివాహ నిశ్చితార్థం మూడు నెలల క్రితం జరిగింది. ఈ వివాహానికి మలేసియా మంత్రి దత్తో సామువేలు, ఆయన భార్య ఇంద్రాణి సామువేలు హాజరయ్యారు. తుగ్గక్ వారపత్రి సంపాదకుడు చో రామస్వామి, పారిశ్రామికవేత్తలు ఎం. ఎ. ఎం. రామస్వామి, ఎ.సి. ముత్తయ్య, నిర్మాత మణి రత్నం, ఆయన భార్య సుహాసిని, దర్శకుడు ఆర్.కె. సెల్వమణి, నటులు నగేష్, విజయకాంత్, సూర్య, నటుడు, అన్నాడియంకె సభ్యుడు ఎస్ వే శేఖర్ హాజరయ్యారు.












Click it and Unblock the Notifications
