తెలంగాణపై వైయస్‌ది ద్వంద్వవైఖరి: టిడిపి
హైదరాబాద్: తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని తెలుగుదేశం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. తెలంగాణపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఓట్ల కోసం ఎన్నికల్లో వేర్పాటువాదులతో పొత్తు పెట్టుకున్న రాజశేఖర్ రెడ్డి గెలిచిన తర్వాత చిన్న రాష్ట్రాల వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని అంటున్నారని ఆయన అన్నారు.
చిన్న రాష్ట్రాల వల్ల అభివృద్ధి జరగదని తాము మొదటి నుంచీ చెబుతూనే వస్తున్నామని, అయితే కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోందని ఆయన అన్నారు. ఎవరి ప్రభుత్వ హయాంలో తెలంగాణ అభివృద్ధి జరిగిందో తేల్చడానికి బహిరంగ చర్చకు రావాలని ఆయన కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు. తెలంగాణపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో స్పష్టమైన ప్రకటన ఇప్పించాలని ఆయన రాజశేఖర్ రెడ్డిని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఒక్కొక్కరు ఒక్కో రకమైన ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
