తెలంగాణ ఐక్య వేదిక విద్యార్థుల అరెస్టు
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన తెలంగాణ ఐక్యవేదిక విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణపై బిజెపి తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఐక్యవేదిక విద్యార్థులు బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద ధర్నా చేశారు. జంటనగరాల్లోని వివిధ కళాశాలలకు చెందిన దాదాపు వేయి మంది విద్యార్థులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతోందని, అందువల్ల తెలంగాణపై బిజెపి తన వైఖరిని స్పష్టం చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించడానికి అక్కడికి వెళ్లామని తెలంగాణ ఐక్యవేదిక విద్యార్థులు అంటున్నారు. తెలంగాణపై అయోమయాన్ని విడనాడాలని వారు బిజెపి నాయకులను కోరారు.












Click it and Unblock the Notifications
