వైయస్ ఇంటి ప్రహారిగోడ కూల్చివేత
హైదరాబాద్: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గల ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఇంటి ప్రహారిగోడను హైదరాబాద్ నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేశారు. బంజారాహిల్స్‌లోని, జూబిలీహిల్స్‌లోని రోడ్లను కొన్ని చోట్ల విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో కొన్ని కట్టడాలను కూల్చివేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఇంటి ప్రహారీ గోడ కూడా ఒకటి.
ఆ విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. కూల్చివేత తన ఇంటితోనే ప్రారంభించండని, దాని వల్ల ఇతరులు వెంటనే ముందుకు వస్తారని ముఖ్యమంత్రి తమతో చెప్పినట్లు నగరపాలక సంస్థ అధికారులు చెప్పారు. దీంతో వారు శుక్రవారంనాడు ముఖ్యమంత్రి ఇంటి ప్రహారి గోడ కూల్చివేతకు చర్యలు చేపట్టారు. ఇల్లు ముఖ్యమంత్రిది కావడంతో కూల్చివేత విషయంలో అత్యంత జాగరూకతతో వ్యవహరించారు.












Click it and Unblock the Notifications
