కెసి ఆర్ ప్రజల్లో ఉంటే మంచిది: గద్దర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు ప్రభుత్వంలో ఉండడం కన్నా ప్రజల్లో ఉంటే మంచిదని ప్రజా కవి గద్దర్ అన్నారు. నిషేధిత విప్లవ రచయితల సంఘం నాయకుడు వరవరరావును చంద్రశేఖర్ రావు కలుసుకోవడాన్ని ఆయన సమర్థించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరినైనా కలుసుకోవచ్చునని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
రచయితల పట్ల, కళాకారుల పట్ల ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించడం సబబు కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం నిషేధం ద్వారా భావ ప్రకటనా స్వేచ్ఛను తొలగించి రాజ్యాంగ హక్కును కాలరాసిందని ఆయన విమర్శించారు. మాట్లాడే స్వేచ్ఛను తొలగించిందంటే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదలైనట్లేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
