కేంద్రంలోనూ వైదొలిగే యోచన: నరేంద్ర

హైదరాబాద్‌: కేంద్రంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వం నుంచి వైదొలిగే యోచన ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్‌) నాయకుడు, కేంద్ర మంత్రి సూచనప్రాయంగా తెలియజేశారు. ప్రభుత్వం నుంచి వైదొలగాలని మొన్ననే అనుకున్నామని, అయితే వ్యవసాయ శాఖ మంత్రి, ఎన్‌సిపి నేత శరద్‌పవార్‌ నివారించడంతో ఆగిపోయామని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ నెల 8వ తేదీన యుపిఎ భాగస్వామ్య పక్షాలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

ప్రభుత్వం నుంచి వైదొలిగినా యుపిఎలో కొనసాగుతామని, యుపిఎలో కొనసాగుతూ తెలంగాణపై కాంగ్రెస్‌ మీద ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అవమానకరమైన మాటలు మాట్లాడడం, తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా వ్యాఖ్యానించడం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసే విధంగా వ్యవహరించడం భరించలేకపోతున్నామని ఆయన అన్నారు. తాము ప్రభుత్వంలో కొనసాగకపోతే వైయస్‌పై తాము స్వేచ్ఛగా విమర్శలు చేసి వుండేవారమని ఆయన అన్నారు. తాము ప్రభుత్వంలో ఉండడం వల్ల విమర్శలు చేయలేకపోతున్నామని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+