టికెట్ రాక ఆత్మహత్యాయత్నాలు
హైదరాబాద్: నిషేధం వున్న సమయంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డినే అరెస్టు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్) నేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర అన్నారు. టి ఆర్‌యస్‌కు నక్సల్స్‌తో సంబంధాలున్నాయని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఆరోపించారని వచ్చిన వార్తలపై ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు. నక్సల్స్‌తో టి ఆర్‌యస్ సంబంధాలున్న విషయం అసెంబ్లీ ఎన్నికల్లో గుర్తుకు రాలేదా అని ఆయన అడిగారు.
నిషేధం ఉన్నప్పుడు నక్సలైట్లతో ఎందుకు మాట్లాడారని ఆయన అడిగారు. చర్చల సందర్బంలో వాతావరణాన్ని నక్సల్స్‌కు అనుకూలంగా మార్చారని, రిక్రూట్‌మెంట్లు పెంచుకోవడానికి, డబ్బులు వసూలు చేసుకోవడానికి వీలైన వాతావరణాన్ని కల్పించారని ఆయన అన్నారు. సాహిత్యవేత్తలు, ఆరోగ్యం బాగాలేని వరవరరావును తమ నేత చంద్రశేఖర్ రావు పరామర్శించడంలో తప్పేమిటని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications
