అభ్యర్థుల గెలుపు బాధ్యత ఎమ్యెల్యేలదే: వైయస్
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత శాసనసభ్యులదేనని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికలపై ఆయన శుక్రవారం నాడు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, జిల్లా పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్) ప్రభావం ఉండదని శాసనసభ్యులు ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారంతో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ శాసనసభ్యులు తమ శక్తియుక్తులను వినియోగిస్తున్నారు.












Click it and Unblock the Notifications