ప్రతికూలంగా వస్తే కాంగ్రెస్‌దే బాధ్యత: సిపియం
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే కాంగ్రెస్ నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. తమ బలానికి స్థానిక కాంగ్రెస్ నాయకులు తగిన గౌరవం ఇవ్వడం లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమకు అనుకూలంగా రాకపోతే స్థానిక కాంగ్రెస్ నాయకుల అసమంజస వైఖరే కారణమవుతుందని ఆయన అన్నారు.
స్థానిక కాంగ్రెస్ నాయకులు పొత్తుల విషయంలో సరిగా వ్యవహరించడం లేదని, ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి జోక్యం చేసుకున్నా పరిస్థితి చక్కబడలేదని ఆయన అన్నారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ నాయకులు అసమంజసంగా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ నాయకుల వైఖరిని సరిదిద్దడానికి ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు జారీ చేయడానికి వీలుందని, అయితే రాష్ట్ర నాయకత్వం అందుకు సిద్ధపడడం లేదని ఆయన అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌కు తమ మద్దతు అవసరం ఉంది కానీ ఇక్కడ సర్దుబాటుకు ఇష్టపడడం లేదని ఆయన అన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు పూర్తి కమ్యూనిస్టు వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications