ముంబాయి నగరానికి మళ్లీ వాన ముప్పు
ముంబాయి: ముంబాయి నగరాన్ని మరోసారి భారీ వర్షాలు తాకాయి. ఈ వర్షాల కారణంగా సబర్బన్ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ముంబాయిలో వర్షాలు కురవడం ప్రారంభమైంది. ఉత్తర ముంబాయిలో వర్షపాతం ఎక్కువగా ఉందని పోలీసు వర్గాలు చెప్పాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో పలు చోట్లు ట్రాఫిక్ జామ్ అయింది.
అంథేరి, ఖార్, మిలన్ సబ్‌వేలు, సహర్ బాహర్ జంక్షన్, విలే పార్లే జంక్షన్, కోల్డ్‌విటా లేన్, గోఠక్‌పూర్ నారాయణనగర్ జంక్షన్, కుర్లా డిపో వాడియా జంక్షన్, సియాన్ సర్కిల్, హింద్‌మాతా జంక్షన్, భారత మాతా జంక్షన్ ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ ప్రాంతాల్లో అర అడుగు లోతు నీళ్లు నిలిచిపోయాయి. పాఠశాలలకు మధ్యాహ్నం నుంచి సెలవు ఇచ్చేశారు.












Click it and Unblock the Notifications