సానియాకు రూ. 20 లక్షల చెక్కు అందించిన వైయస్
హైదరాబాద్: యుయస్ ఓపెన్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి నాలుగో రౌండ్‌కు చేరుకున్న టెన్సిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి శుక్రవారం 20 లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేశారు. సానియాకు 20 లక్షల రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి గురువారంనాడే ప్రకటించారు. ప్రభుత్వ సహకారమే లేకుంటే తాను ఈ స్థాయికి చేరుకుని ఉండేదాన్ని కాదని ఆమె ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇండోనేషియాలో జరిగే బాలీ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు తాను ఈ రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్తున్నట్లు ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications