హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదానికి మరో విద్యార్థి బలి
హైదరాబాద్: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదానికి మరో విద్యార్థి బలయ్యాడు. బండ్లగూడలో లారీ ఢీకొని ఒక విద్యార్థి మృత్యువాత పడ్డాడు. మనవర్ అనే ఎల్.కె.జి. విద్యార్థి లారీ ఢీకొనడంతో మరణించాడు. ఆగ్రహించిన స్థానికులు లారీని తగులబెట్టారు. రోడ్డు ప్రమాదాల్లో హైదరాబాద్‌లో విద్యార్థులు మరణించడం ఇది మూడోసారి. ఇంతకు సికింద్రాబాద్‌లో ఒక విద్యార్థిని, హైదరాబాద్‌లోని హైదర్‌గూడాలో ఒక విద్యార్థి రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. అప్పటి నుంచి విద్యార్థుల భద్రత కోసం ట్రాఫిక్ పోలీసులు, ప్రభుత్వం పలు చర్యలకు ఉపక్రమించినప్పటికీ ఫలితం లేదని తాజా సంఘటన రుజువు చేస్తోంది.












Click it and Unblock the Notifications