మున్సిపల్ పోల్స్: దాడులు, ఏకగ్రీవాలు, కిడ్నాప్‌లు
హైదరాబాద్: టికెట్ల పంపినీని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్) కార్యకర్తలు పార్టీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యర్థుల కిడ్నాప్‌లు జరిగినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. మాచర్ల 13వ వార్డు తెలుగుదేశం అభ్యర్థి బాలయ్యను ప్రత్యర్థులు కిడ్నాప్ చేసినట్లు ఆయన బంధువులు ఆరోపిస్తున్నారు. తాడిపత్రిలో మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి సోదరుడు జె.సి. ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్న వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కిడ్నాప్ చేసి నామినేషన్ ఉపసంహరింపజేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.
కర్నూలులో బి- ఫారాలు ఇవ్వనందుకు నిరసనగా కాంగ్రెస్ అభ్యర్థులు ధర్నాకు దిగారు. పార్వతీపురం 26వ వార్డు నుంచి మంత్రి శత్రుచర్ల విజయరామరాజు సోదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రకాశం జిల్లా చీరాలలో బి - ఫారాలు ఇవ్వకపోవడంతో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడికి, అభ్యర్థులకు మధ్య ఘర్షణ జరిగింది. గుంటూరులోని 37వ వార్డు అభ్యర్థిత్వంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత ఎర్రంనాయుడుతో వాగ్యుద్ధానికి దిగారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని 28వ వార్డు నుంచి జగన్‌మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మెదక్‌లో కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు నంది ఎల్లయ్యపై, సర్వే సత్యనారాయణపై ఇద్దరు మహిళా కార్యకర్తలు దాడికి దిగారు. తమ సీటును కమ్యూనిస్టులకు కేటాయించడం వల్లనే దాడికి దిగినట్లు మాజీ కౌన్సిలర్ స్వరూప చెప్పారు.












Click it and Unblock the Notifications