ఎమ్యెల్యేలు, ఎంపిలకు ఓటుహక్కుపై హైకోర్టులో రిట్
హైదరాబాద్: మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల చైర్‌పర్సన్ల, మేయర్ల ఎన్నికల్లో శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు ఓటు హక్కు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ శుక్రవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. మున్సిపాలిటీల్లో, నగరపాలక సంస్థల చైర్‌పర్సన్, మేయర్ల ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యులు 30 రోజుల లోపల ఓటు హక్కును కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా మున్సిపాలిటీల వార్డుల, నగరపాలక సంస్థల డివిజన్ల ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తాము ఓటు ఎక్కడ వినియోగించుకోదలుచుకున్నదీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు నిర్ణయించుకోవచ్చునని కూడా ఎన్నికల కమీషన్ తెలియజేసింది. ఈ నిర్ణయం చట్ట విరుద్ధమంటూ తెలుగుదేశం పార్టీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
మున్సిపల్ ఎన్నికల్లో దొడ్డి దారిన విజయం సాధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు ఓటు హక్కు కల్పిస్తోందని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచీ విమర్శిస్తోంది. అసలు పరోక్ష ఎన్నికలు నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయాన్నే అది వ్యతిరేకిస్తోంది.












Click it and Unblock the Notifications