తెలంగాణ కోసంప్రాణత్యాగం: చంద్రశేఖరరావు

హైదరాబాద్‌:ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణరాష్ట్రం ఏర్పడకపోతే ఎటువంటి చర్యలుతీసుకోడానికైనా తెలంగాణజాగరణ సేన సిద్ధంగా ఉండాలనిటిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖరరావు పిలుపుఇచ్చారు.తెలంగాణ జాగరణ సేన శిక్షణ శిబిరాన్నిశనివారం ఇక్కడ ప్రారంభించినఅనంతరం ఆయన తెలంగాణ సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇటుకతోకొడితే రాయితో, చేయితో కొడితేకర్రతో కొడతామని ఆయన అన్నారు.తెలంగాణతో పెట్టుకోవడమంటే కొరివితోతల గోక్కున్నట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణవాదాన్నివ్యతిరేకించిన కాసు బ్రహ్మానందరెడ్డినుంచి చంద్రబాబు నాయుడు వరకుతెరమరుగై పోయారని ఆయనఅన్నారు. తెలంగాణ జాగరణ సేనహింసాత్మక చర్యలకు పాల్పడుతుందని కొందరు అసత్యప్రచారం చేస్తున్నారని చంద్రశేఖరరావు ఆరోపించారు.ప్రాణాలకు తెగించి అయినా తెలంగాణరాష్ట్రం సాధించుకోవాలని ఆయన పిలుపు ఇచ్చారు. ప్రతి పల్లెలో తెలంగాణవాదాన్నివిన్పించాలని ఆయన కోరారు. తెలంగాణ వాదాన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తున్నరాజశేఖరరెడ్డికి బుద్ధి చెప్పాలని చంద్రశేఖరరావుసూచించారు. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో వైఎస్‌ప్రభుత్వం కూడా తెలంగాణకు అన్యాయంచేసిందని ఆయన ఆరోపించారు.తెలంగాణ జాగరణ సేన శిక్షణశిబిరానికి కేంద్రమంత్రి నరేంద్ర,టిజెఎస్‌ చీఫ్‌ ఉమాకాంత్‌ హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+