ఒంటరిపోరు మాకే లాభం: ఇంద్రసేనారెడ్డి
హైదరాబాద్: మున్పిపల్ ఎన్నికల్లో ఒంటరి పోరు తమకే లాభమని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు ఎన్. ఇంద్రసేనా రెడ్డి అన్నారు. ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వం నుంచి వెలుపలికి వస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్)తో కలిసి పని చేసే విషయాన్ని ఆలోచిస్తామని ఆయన బుధవారం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన విమర్శించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆయన అన్నారు. అన్ని పార్టీలను తాము సమాన ప్రత్యర్థులుగా భావిస్తున్నామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
