నాగ చైతన్య 'వృషకర్మ' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. హారర్ మైథలాజికల్ స్పెక్టాకిల్ గా..

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'వృషకర్మ' రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది డిసెంబర్ 4 విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. తండేల్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నాగ చైతన్య, విరూపాక్ష లాంటి కల్ట్ హారర్ సినిమా తర్వాత దర్శకుడు కార్తిక్ దండు కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. వృషకర్మ మూవీ నుంచి గతంలో రిలీజ్ అయిన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పటివరకూ నాగచైతన్య యూత్ ఫుల్ రొమాంటిక్ సినిమాల్లోనే ఎక్కువగా కనిపించారు. ఇప్పుడు కొత్తగా హారర్ మైథలజికల్​ డ్రామాలో చైతు నటించడం ఇదే మొదటిసారి కావడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. అటు కార్తిక్ దండు విరూపాక్షతో తొలి సినిమాతోనే తానేంటో నిరూపించుకున్నారు. ఈ మూవీలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ నటించారు. 2023 ఏప్రిల్ లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ మూవీతో మరో భారీ హిట్ తన ఖాతాలో వేసుకునేందుకు కార్తిక్ దండు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ డిసెంబర్ 4 న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ ఫైట్ గట్టిగానే ఉండబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫౌజీ మూవీ డిసెంబర్ 3 న రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే ఆ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది.

Vrushakarma release date fixed for Naga Chaitanya Vrushakarma grand release on December 4 cinemas

అంటే ప్రభాస్ సినిమాకు ఒక్కరోజు గ్యాప్ లో నాగ చైతన్య వృషకర్మ మూవీ రిలీజ్ కానుంది. ఇక కింగ్ నాగార్జున 100 వ సినిమా కింగ్ 100 డిసెంబర్ 24 న రిలీజ్ కానుంది. అలాగే నందమూరి బాలకృష్ణ దాదా మూవీ కూడా డిసెంబర్ 24న థియేటర్లలోకి రానుంది. దాంతో సంక్రాంతి ఫెస్టివల్ కు ముందే టాలీవుడ్ లో డిసెంబర్ ఫైట్ ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+