నెల్లూరు టిడిపి నేతల ఆందోళన: అరెస్టులు
నెల్లూరు: ఓటర్ల జాబితా విడుదల చేయనందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బుధవారంనాడు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ధర్నాకు దిగారు. కార్యాలయంలోకి ఉద్యోగులెవరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు తెలుగుదేశం నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో సహా పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేశారు.
అవకతవకలు జరిగినందున వాటిని సరిదద్ది నెల్లూరుకు సంబంధించి డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాను బుధవారం అందజేస్తామని అధికారులు తెలియజేశారు. ఆ హామీ మేరకు అధికారులు ఓటర్ల జాబితాను అందజేయకపోడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు.












Click it and Unblock the Notifications
