భాగ్యనగరవీధుల్లో నిమజ్జనోత్సవాలు
హైదరాబాద్:వినాయక నిమజ్జనం సందర్భంగా శనివారంనగరంలోని రోడ్లు పండుగ శోభను సంతరించుకున్నాయి. వివిధప్రాంతాల నుంచి వస్తున్న వినాయకవాహనాలతో మధ్యాహ్నం నుంచి రోడ్లునిండిపోయాయి. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డులో జనం కిక్కిరిసిపోయారు. ట్యాంక్‌బండ్ వద్ద 18 క్రేన్లు,నెక్లెస్ రోడ్డులో 8 క్రేన్లు గణేష్‌విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలోనిమగ్నమయ్యాయి. పోలీసులు హెలికాప్టర్‌ద్వారా విద్రోహులపై డేగ కన్ను వేశారు.డప్పు వాయిద్యాలు, నృత్యాలతో చిన్నపిల్లలుమొదలు వృద్ధుల వరకు ఈఉత్సవంలో పాల్గొన్నారు. 45 అడుగులఎత్తైన ఖైరతాబాద్ భారీ గణేశుడినిమజ్జనం రాత్రి ఎనిమిది గంటల తర్వాతజరుగుతుంది.












Click it and Unblock the Notifications