'పెద్ది' సెన్సార్ పూర్తి: టాక్ ఇలా ఉందేంటి బాబోయ్..!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ 'పెద్ది'.. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. పెద్ది ట్రైలర్ సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం యూట్యూబ్ లో మాత్రమే కాకుండా.. ఇన్ స్టాగ్రామ్ , ఎక్స్ , ఫేస్ బుక్ ఇలా అన్ని యాప్స్ లోనూ ఈ చిత్రానికి రికార్డు స్థాయి వ్యూస్ వచ్చినట్లు సమాచారం. ఇలా అన్ని సోషల్ మీడియా నెట్ వర్క్స్ నుండి ఈ చిత్రానికి కేవలం 24 గంటల్లోనే ఏకంగా 101 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు తెలుస్తోంది. పెద్ది చిత్రానికి సంబంధించిన మూడో సాంగ్ ను ఈ నెల 22న విడుదల చేయబోతున్నారు. భోపాల్ లో ఒక మ్యూజికల్ నైట్ ను నిర్వహించి.. AR రెహమాన్ లైవ్ పెర్ఫార్మన్స్ ద్వారా ఈ సాంగ్ రిలీజ్ కాబోతున్నట్లు స్పష్టం అవుతోంది.

ఇక పెద్ది సినిమా నేపథ్యం విజయనగరం జిల్లాలో జరుగుతుంది. కాబట్టి మొదటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జూన్ 2న అక్కడే ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం. అదే విధంగా రెండో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నారు మేకర్స్. ఈ రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో.. ఏదో ఒక ఈవెంట్ లో రిలీజ్ ట్రైలర్ ని విడుదల చేస్తారని సమాచారం. అదే విధంగా హైదరాబాద్ లో నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు సమాచారం అందుతోంది. ఇక ఈ మూవీ జూన్ 4 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

Peddi Censor Cleared Ram Charan Buchi Babu Sana s Rural Sports Action Drama Hit Theatres on June 4

అయితే తాజాగా పెద్ది సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమా రన్ టైన్ 3 గంటల 4 నిమిషాలు ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ని జారీ చేశారు. ఇక సెన్సార్ సభ్యుల టాక్ టాక్ చూస్తే.. సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకూ ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు బుచ్చిబాబు అద్భుతంగా తెరకెక్కించాడట. మూవీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సాగుతుందట. అలాగే ముఖ్యంగా సెకండాఫ్ లో చివరి 45 నిమిషాలు షాకింగ్ గా ఉంటుందని సమాచారం. రామ్ చరణ్ పెద్ది పాత్రలో నట విశ్వరూపం చూపించాడట. రామ్ చరణ్ నటనకు ఏడవని మనిషంటూ ఎవ్వరూ ఉండరని స్పష్టం అవుతోంది. మరి ఫుల్ రివ్యూ కోసం జూన్ 4 వరకు ఆగాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+