బంగాళాఖాతంలో వాయుగుండం: ఉత్తరాంధ్రలో వర్షాలు
విశాఖపట్నం: బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన వాయుగుండం ఆదివారంనాటికి బలపడింది. ఒరిస్సాలోని పారదీప్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్రలో, ఖమ్మం, వరంగల్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిశోధనా కార్యాలయం అధికారులు చెప్పారు. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావం వల్ల తీర ప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. కళింగపట్నం, భీమునిపట్నంలలో మూడవ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు.
ఇదిలావుంటే, గోదావరి నదిలో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. గోదావరి ఉపనది ప్రాణహిత పొంగిపొర్లుతోంది.












Click it and Unblock the Notifications
