మొరాయించిన సియం హెలికాప్టర్
వరంగల్: వరంగల్ జిల్లా హసన్‌పర్తిలో ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మొరాయించింది. దీంతో అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కరీంనగర్ జిల్లాలోని శ్రీపాదరావు ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి వరంగల్ జిల్లాలోని గోదావరి ఎత్తిపోతల ప్రాజెక్టు పరిశీలనకు వచ్చారు. దీన్ని పరిశీలించిన అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరే సమయంలో హెలికాప్టర్ మొరాయించింది.
దాంతో ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. ఆ తర్వాత కొద్దిసేపటికి హెలికాప్టర్ పని చేయడం ప్రారంభించింది. దీంతో ఆయన వెనుదిరిగి హెలిపాడ్ వద్దకు చేరుకున్నారు. తాను ఎన్నికల కోసం ప్రాజెక్టుల సమీక్షను చేపట్టడం లేదని, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే సమీక్ష జరుపుతున్నానని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications
