ఒక్క సీటు ఎక్కువ గెలువగలరా?: దేవేందర్
నల్లగొండ: మున్సిపల్ ఎన్నికల్లో తమ కంటే కాంగ్రెస్‌వారు ఒక్క సీటైనా ఎక్కువ గెలవగలరా అని తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ హోం మంత్రి టి. దేవేందర్ గౌడ్ సవాల్ చేశారు. తాను జిల్లాలన్నీ పర్యటిస్తున్నానని, పరిస్థితి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
ప్రజలు నిలదీస్తారనే భయంతోనే ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రమంతటతా పులివెందుల సంస్కృతిని అమలు చేయాలనుకుంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్) నాయకుడు, కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర్ రావు పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications