ఇసి కొరడా ఝళిపించాలి: చంద్రబాబు
విజయవాడ: మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికార కాంగ్రెస్ పార్టీపై ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా వ్యవహరించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. బరి తెగించినవారిపై ఎన్నికల కమీషన్ కొరడా ఝళిపించాలని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. నిష్పాక్షికంగా వ్యవహరించడంలో ఎన్నికల సంఘం సరైన పాత్ర పోషించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
అనంతపురం జిల్లా పెనుకొండ ఉప ఎన్నికల్లో ఎన్నికల కమీషన్ నిష్పాక్షికంగా వ్యవహరించడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి అవకాశం కలుగుతోందని ఆయన అన్నారు. పరోక్ష ఎన్నికలు జరిగి వుంటే మెజారిటీ మున్సిపాలిటీలు తాము గెలుచుకుని ఉండేవారమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
