ఆధారాలు చూపిస్తే చర్యలు తీసుకుంటాం: ఇసి
హైదరాబాద్: నిర్దిష్టమైన ఆధారాలు చూపిస్తే తాము తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రధానాధికారి ఎ.వి.యస్. రెడ్డి అన్నారు. రాజకీయ నాయకులు పరిధులు దాటి నిరాధారణమైన ఆరోపనలు చేస్తున్నాయని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రిపోలింగ్, పోలింగ్ వాయిదా, రీ కౌంటింగ్ వంటి విషయాల్లో తాము చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రోడ్‌షోలకు విద్యుత్ కోత విధిస్తే చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణల విషయంలో తమ శక్తి మేరకు స్పందించామని, తాము పట్టించుకోలేదనడం సమంజసం కాదని ఆయన అన్నారు. తుపాను తగ్గుముఖం పడుతోందని, అందువల్ల ఎన్నికలను వాయిదా వేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
