కొనసాగుతున్న రైల్వే ట్రాక్‌ల పునరుద్ధరణ పనులు

హైదరాబాద్‌: వరదల తాకిడికి ధ్వంసమైన రైల్వే ట్రాక్‌లను పునరుద్ధరించే కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే నిమగ్నమైంది. ఇప్పటికీ కొన్ని రైళ్లు నడవడం లేదు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. వరదల వల్ల రైల్వేకు 50 నుంచి 60 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లి వుంటుందని అంచనా. 42 ట్రాక్‌ల వద్ద ప్రవాహం తగ్గిన తర్వాత లైన్లను పునరుద్ధరిస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ మాథుర్‌ తెలిపారు.

చెన్నై, హైదరాబాద్‌ల మధ్య గల ట్రాక్‌ను రేపటి లోగా పునరుద్ధరిస్తామని, విజయవాడ- కాజీపేటల మధ్య సింగిల్‌ లైన్‌ పునరుద్ధరించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ సాయంత్రంలోగా లేదా రేపటిలోగా లైన్‌ను పునరుద్ధరించగలమని మాథుర్‌ తెలిపారు. గోదావరి, గౌతమి ఎక్స్‌ప్రెస్‌లను రేపటి నుంచి నడిపిస్తామని ఆయన చెప్పారు.

ఇదిలావుంటే, రోడ్ల పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు, హైదరాబాద్‌ నుంచి విజయవాడకు మధ్య రహదారులు నీటి మునిగిపోవడం వల్లనో, రోడ్లు గండ్లు పడిపోవడం వల్లనో బస్సుల రాకపోకలకు వీలుగా లేవు. దీంతో విజయవాడకు ఖమ్మం, తిరువూరుల మీదుగా బస్సులు నడిపిస్తున్నారు. వరంగల్‌కు కరీంనగర్‌ మీదుగా నడిపిస్తున్నారు. ఆర్టీసికి 9 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని ఆర్టీసి మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణారావు చెప్పారు.

విశాఖపట్నం నుంచి వరుసగా మూడో రోజు కూడా విమానాలు నడవడం లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+