నరేంద్ర నోరు పారేసుకోవద్దు: కేశవరావు

హైదరాబాద్‌: తన విషయంలో అనవసరంగా తలదూర్చవద్దని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్‌ కె. కేశవరావు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్రకు హితవు చెప్పారు. పిసిసి అధ్యక్షపదవి గురించి నరేంద్ర మాట్లాడకూడదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను పిసిసి అధ్యక్ష పదవికి అనర్హుడినని అనడానికి నరేంద్రకున్న అర్హత ఏమిటని ఆయన అడిగారు.

పరస్సర విమర్శలు మానుకుందామని ఎన్ని సార్లు తాను చెప్పినా వినకుండా నరేంద్ర పదే పదే విమర్శలు చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. కేంద్ర మంత్రిగా వుంటూ తాను ఆర్‌యస్‌యస్‌ కార్యకర్తనని చెప్పుకోవడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. గుంటూరు మేయర్‌ ఎన్నిక కులవివాదంగా మారడం దురదృష్టకరమని ఆయన అన్నారు. తాను కుల వివక్షను పాటిస్తున్నానని రాయపాటి నిరూపిస్తే తాను తప్పుకుంటానని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+