మున్సిపాలిటీలకు స్వయం నిర్ణయాధికారం: వైయస్
హైదరాబాద్: మున్సిపాలిటీలకు స్వయం నిర్ణయాధికారం కల్పిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఆదివారంనాడు మున్సిపాలిటీలకు ఎన్నికైన చైర్‌పర్సన్లకు ఒక బహిరంగ లేఖ రాశారు. మున్సిపాలిటీలు అభివృద్ధిలో స్వయం నిర్ణయాధికారం తీసుకోవడానికి వీలుగా ఆయన ఆరు సూత్రాల పథకాన్ని ప్రతిపాదించారు.
రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా మున్సిపాలిటీలకు అన్ని అధికారాలు సంక్రమింపజేస్తామని ఆయన తెలిపారు. పట్టణాల అభివృద్ధికి తాము ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తామని ఆయన చెప్పారు. ప్రపంచ బ్యాంక్ సహాయంతో చేపట్టిన పట్టణాభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన మున్సిపాలిటీల కొత్త పాలక మండళ్లకు సూచించారు.












Click it and Unblock the Notifications