నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగితే కఠిన శిక్ష: సియం
హైదరాబాద్: వాహన డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరిగితే కఠిన శిక్ష పడేలా చూస్తామని, అవసరమైతే అందుకు చట్టాన్ని సవరిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమం సఫర్‌ను ఆయన ఆదివారంనాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమం నెలరోజుల పాటు జరుగుతుంది. భార్యా పిల్లల ఫొటోలను ముందు పెట్టుకుని డ్రైవర్లు వాహనాలు నడపాలని ఆయన సూచించారు. పాఠశాల విద్యార్థులను ఆయా పాఠశాలల యాజమన్యాలు తమ తమ బస్సుల్లోనే తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
వాహనాల సంఖ్యతో పాటు రోడ్డు ప్రమాదాలు పెరుగతుండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్ల విస్తరణ ఒక్కటే పరిష్కారం కాదని, ప్రజలు కూడా తమ బాధ్యత గుర్తెరగాలని ఆయన అన్నారు. ప్రాణాపాయ స్థితిని తప్పించడానికే హెల్మెట్ల ధారణ అనివార్యం చేశామని ఆయన చెప్పారు. ప్రజల భాగస్వామ్యం లేనిదే రోడ్లు ప్రమాదాల నివారణ సాధ్యం కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications