సానియా మీర్జాకు 31వ ర్యాంక్
న్యూఢిల్లీ: హైదరాబాద్ టెన్నిస్ తార సానియా మీర్జా తన ర్యాకింగ్‌ను మరింత మెరుగుపరుచుకుంది. డబ్ల్యుటిఎ ర్యాంకింగ్‌లో ఆమె ఆరు స్థానాలు ఎగబాకింది. జపాన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకోవడం వల్ల సానియా ర్యాంకింగ్ మెరుగుపడింది. ఆమె ప్రస్తుతం 31 ర్యాంక్‌ను సాధించింది.
జపాన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌లో తన కన్నా మెరుగైన ర్యాంకింగ్‌లో ఉన్న టాప్ సీడ్ వేరా జ్వొవరేవాపై సానియా విజయం సాధించింది. అయితే సెమీ ఫైనల్‌లో టాటియానా గోలోవిన్‌పై ఓడిపోయింది. సన్‌ఫీస్ట్ ఓపెన్‌లో ఓటమితో సానియా మూడు ర్యాంక్‌లు పోగొట్టుకుంది.












Click it and Unblock the Notifications
