రూ.31 లకే 132 కి.మీ. ప్రయాణం! మైలేజ్ ప్రియుల కోసం సరికొత్త స్కూటర్!
ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ అయిన కైనెటిక్ తన పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‌ను మరింత విస్తరిస్తూ భారత మార్కెట్లోకి కొత్త మోడల్‌ను విడుదల చేసింది. కైనెటిక్ DX+ మోడల్‌లో 3.1kwh సామర్థ్యమున్న కొత్త బ్యాటరీ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ రేంజ్ అందించడమే లక్ష్యంగా కంపెనీ ఈ కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
ఈ కొత్త కైనెటిక్ DX+ స్కూటర్లో 3.1kwh పెద్ద బ్యాటరీని అమర్చడంతో పాటు మోటార్‌ను 3.8KW గరిష్ట శక్తికి డీట్యూన్ చేశారు. ఈ మార్పుల వల్ల స్కూటర్ రేంజ్ దాదాపు 7 కిలోమీటర్లు పెరిగింది. ఇండియన్ డ్రైవింగ్ సైకిల్ పరీక్షల ప్రకారం ఈ స్కూటర్ ఒకే ఛార్జ్‌పై ఏకంగా 132 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. గృహ విద్యుత్ ద్వారా ఈ 3.1kwh బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయడానికి దాదాపు రూ.31 మాత్రమే ఖర్చవుతుందని అంచనా.

ఈ స్కూటర్ కేవలం రేంజ్ మాత్రమే కాకుండా అధునాతన ఫీచర్లతో కూడా ఆకట్టుకుంటోంది. ఇందులో మెటాలిక్ బాడీ, ఎల్ఈడీ లైటింగ్, 8.8 అంగుళాల ఎల్సీడీ ఇన్‌స్ట్రుమెంట్, 37 లీటర్ల భారీ బూట్ స్పేస్, కీలెస్‌గో, పాస్ వర్డ్ ఆధారిత ఇగ్నిషన్, క్రూయిజ్ కంట్రోల్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి హంగులు ఉన్నాయి. ఈ మోడల్ ఎరుపు, నీలం, నలుపు, బూడిద, తెలుపు వంటి ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది.
ఇక ధరల విషయానికొస్తే.. బేస్ వేరియంట్ కైనెటిక్ DX(2.6kwh) ఎక్స్-షోరూమ్ ధర రూ.1,11,499గా నిర్ణయించారు. ఇక DX ప్లస్ 2.6kwh వేరియంట్ ధర రూ.1,21,174 కాగా.. కొత్తగా తీసుకొచ్చిన టాప్ ఎండ్ 3.1kwh బ్యాటరీ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1,27, 650గా ఉంది. ఇండియాలో ఆదరణ పొందుతున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇక్కడే తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7 దేశాలకు ఎగుమతి చేసేందుకు కైనెటిక్ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.














Click it and Unblock the Notifications
