విరుచుకుపడిన భీకర వర్షం.. 50 జిల్లాల్లో వరదల భీభత్సం

థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నగరాన్ని భారీ వర్షాలు వణకిస్తున్నాయి. గురువారం మధ్యాహ్నం ప్రారంభమై శనివారం వరకు ఎకాయెకిన దాదాపు 300 మిమీ వర్షపాతం నమోదు కావడంతో నగరంలోని మొత్తం 50 జిల్లాలను వరద ముంపు ప్రాంతాలుగా అధికారులు ప్రకటించారు. ప్రధాన రహదారులన్నీ జలమయమై రాకపోకలు పూర్తిగా స్థంభించిపోగా, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వచ్చింది. ఎటు చూసినా నీట మునిగిన కార్లు, మోకాళ్ల లోతులో ప్రవహిస్తున్న నీటితో జనజీవనం అతలాకుతలమైంది.

అప్రమత్తమైన యంత్రాంగం.. గరిష్ట స్థాయిలో పంపింగ్

తూర్పు ప్రాంతాలు ఈ వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయని బ్యాంకాక్ గవర్నర్ చద్చార్ట్ సిట్టిపుంట్ తెలిపారు. నగరంలోని కాలువలు నిండుగా ప్రవహిస్తుండటంతో పాటు మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. సెకనుకు దాదాపు 1,200 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో పంపింగ్ స్టేషన్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. మళ్లీ వర్షం కురవకపోతే మరో ఆరు గంటల్లో పరిస్థితులు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు మంచంపై ఉండే రోగులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తాత్కాలికంగా ఆసుపత్రులకు వెళ్లాలని సూచించారు.

Bangkok Declares Flood Disaster Across All 50 Districts After Heavy Rains Submerge Roads And Canals

మళ్లీ వర్షాలు! ఆసియాను చుట్టేసిన భారీ మేఘాల వలయం..
మళ్లీ వర్షాలు! ఆసియాను చుట్టేసిన భారీ మేఘాల వలయం..

దేశవ్యాప్తంగా 84 వేల మందికి పైగా బాధితులు

ఈ విపత్తు కేవలం బ్యాంకాక్‌కే పరిమితం కాలకుండా థాయిలాండ్ వ్యాప్తంగా మరో 21 ప్రావిన్సులను వణకిస్తోంది. ఇప్పటివరకు సుమారు 84 వేల మందికి పైగా ప్రజలు ఈ వరదల బారిన పడ్డారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. లాట్ క్రాబాంగ్, విభావది రంగ్సిత్ వంటి రద్దీ ప్రాంతాలతో పాటు పలు ప్రముఖ రహదారులు నీట మునిగాయి. వాహనదారులు ఎవరూ కూడా వరద నీటిలో ప్రయాణించవద్దని, ప్రయాణానికి ముందే రోడ్ల పరిస్థితిని గమనించాలని సెల్-బ్రోడ్‌కాస్ట్ సిస్టమ్ ద్వారా హెచ్చరికలు జారీ చేశారు.

వాతావరణంలో ఊహించని మార్పు.. సగం దేశాన్ని కమ్మిన మేఘాలు
వాతావరణంలో ఊహించని మార్పు.. సగం దేశాన్ని కమ్మిన మేఘాలు

ప్రయాణికులకు ట్రావెల్ అలర్ట్.. విమానాలు, బోట్ల రాకపోకలపై ప్రభావం

భీకరమైన వాతావరణం, వరద నీటి కారణంగా సువర్ణభూమి, డాన్ ముయాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికులు అదనపు సమయాన్ని కేటాయించుకోవాలని థాయిలాండ్ పౌర విమానయాన శాఖ హెచ్చరించింది. రోడ్డు మార్గాలతో పాటు సముద్రంలో కూడా అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో బోటింగ్స్, ఐలాండ్ ట్రిప్స్‌ను రద్దు చేశారు. థాయ్ గల్ఫ్, అండమాన్ సముద్ర తీర ప్రాంతాల్లో 2 నుంచి 3 మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడే అవకాశం ఉన్నందున చిన్న నౌకలు, పడవలు వేటకు వెళ్లవద్దని అధికారులు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+