ఆ శ్రీను పోతే పోయాడు.. ఈ శ్రీనును తీసుకోండి..! జగన్ కు క్యాడర్ డిమాండ్స్..!
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (Majji Srinivasrao) అలియాస్ చిన్న శ్రీను తాజాగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పేసుకున్నారు. ఉన్నట్లుండి చోటు చేసుకున్న ఈ పరిణామం వైసీపీతో పాటు ఇతర పార్టీల్లోనూ చర్చనీయాంశంగా మారింది. లిక్కర్ రవాణా స్కాంలో ఈడీ అరెస్టు భయంతోనే మజ్జి శ్రీనివాసరావు పార్టీ మారి ఉంటారన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే బొత్స తరఫున ఇన్నాళ్లూ క్షేత్రస్దాయిలో రాజకీయాలు నడిపిన మజ్జి శ్రీను ఫిరాయింపుతో ఆయనకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అదే సమయంలో వైసీపీకి కూడా షాక్ తప్పలేదు.
ఈ నేపథ్యంలో మజ్జి శ్రీనుకు ప్రత్యామ్నాయాలపై వైసీపీ దృష్టిసారించింది. అదే సమయంలో వైసీపీలో మరో శ్రీనును తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అతనే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas). గతంలో ధర్మాన సోదరులతో విభేదాలు, వ్యక్తిగత కుటుంబ కారణాలతో వైసీపీ సస్పెండ్ చేసిన దువ్వాడ.. ఆ తర్వాత కూడా జగన్ కు దగ్గరగానే మెలుగుతున్నారు. జగన్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ఎక్కడా ఆయనపై కానీ, పార్టీపై కానీ విమర్శలు చేయకుండా, పైపెచ్చు సమర్థిస్తూ వ్యాఖ్యలు, వీడియోలు చేస్తూనే ఉన్నారు. దీంతో గతంలో దువ్వాడపై విధించిన సస్పెన్షన్ ఎత్తేయాలనే డిమాండ్లు మరోసారి తెరపైకి వస్తున్నాయి.

కొన్ని వేల రేట్లు బెటర్
— Praveen Reddy (@PRAVEENREDDYYCP) September 8, 2026
సస్పెండ్ చేసిన విశ్వాసం గా ఉన్నాడు పార్టీ మీద
సస్పెన్షన్ ఎట్టేయండి @YSRCParty pic.twitter.com/kTU238KCvu
మజ్జి శీను కంటే దువ్వాడ శీను ఎన్నో రెట్లు బెస్ట్ పర్సన్ వైయస్సార్ సిపి అతనిని పార్టీ నుండి సస్పెండ్ చేసిన కూడా పార్టీని మాజీ సీఎం జగన్ అన్నను ఏమాత్రం అవమానించలేదు విమర్శించలేదు సామాన్యంగా కొనసాగుతున్నాడు ఇలాంటి వాళ్లు కావాలి పార్టీకి ఇప్పటికైనా ఆలోచించి గోడమీద పిల్లి లాంటి…
— Dr. Chiranjeevi 🇮🇳 (@DrChiruTweets) September 9, 2026
అయితే మజ్జి శ్రీనివాస్ కు దువ్వాడ శ్రీనివాస్ ప్రత్యామ్నాయం కాదు. మజ్జి శ్రీనివాస్ విజయనగరం రాజకీయాల్లో కీలకంగా ఉంటే, దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఉన్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో సీనియర్లు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ సోదరులతో దువ్వాడకు పొసగడం లేదు. టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడుతో వీరిద్దరూ కుమ్మక్కయ్యాంటూ గతంలో దువ్వాడ తీవ్ర ఆరోపణలు కూడా చేసారు. ఈ నేపథ్యంలో దువ్వాడను ఇప్పటికిప్పుడు పార్టీలో తీసుకోవడం కష్టమే అయినా జగన్ తల్చుకుంటే ఏదీ అసాధ్యం కాదు. సస్పెండ్ అయినా పార్టీకి విధేయుడిగా ఉంటున్న దువ్వాడను తిరిగి పార్టీలో తీసుకుంటే ఉత్తరాంధ్రలో వైసీపీకి ఊపు వస్తుందని క్యాడర్ నుంచి జగన్ కు సోషల్ మీడియా ద్వారా డిమాండ్లు వస్తున్నాయి.














Click it and Unblock the Notifications
