బంగారం ధరలపై భారీగా దెబ్బపడింది.. భయానక పతనం
అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఊహించని విధంగా చోటుచేసుకున్న పరిణామాల వల్ల నేడు దేశీయంగా బంగారం, వెండి ధరలు అమాంతం పడిపోయాయి. అనూహ్యంగా సంభవించిన ఈ భారీ క్షీణత దేశవ్యాప్తంగా మార్కెట్ వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. గత కొన్ని వారాలుగా నానాటికీ పెరిగిపోతూ స్థిరంగా ఉంటూ వస్తోన్న పసిడి ధరలు ఒక్కసారిగా పతనం కావడం వల్ల అటు సాధారణ కొనుగోలుదారులు, ఇటు దీర్ఘకాలిక పెట్టుబడిదారుల్లో అయోమయ స్థితి నెలకొంది.
ఫారిన్ ఎక్స్ఛేంజ్ కోమెక్స్ (Comex) లో నేడు బంగారం ధరలు ఏకంగా 2.02 శాతం మేర భారీ పతనాన్ని నమోదు చేశాయి. దీంతో అక్కడ పసిడి ధర ఔన్స్‌కు 4,323.80 డాలర్ల వద్దకు దిగజారింది. అదే బాటలో వెండి ధర కూడా పయనించింది. భారీగా బలహీనపడింది. కోమెక్స్‌లో వెండి ధర దాదాపు 3.60 శాతం క్షీణించింది. ఔన్స్‌కు 62.465 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ రెండింటి రేట్లు ఒక్కసారిగా పడిపోవడం మార్కెట్ల వాతావరణాన్ని ప్రతిబింబించింది.

ఈ తీవ్ర ఒడిదుడుకులు భారత మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) పై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపించాయి. ఎంసీఎక్స్ లో అక్టోబర్ డెలివరీకి సంబంధించిన పసిడి ధర రికార్డు స్థాయిలో 2,790 రూపాయల మేర నష్టపోయింది. శుక్రవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చి చూస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో 2,510 రూపాయల మేర క్షీణత కనిపించింది. 22 క్యారెట్లల్లో 2,300, 18 క్యారెట్లల్లో 1,880 రూపాయల తగ్గుదల రికార్డయింది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,48,620 వద్ద నమోదైంది. 22 క్యారెట్లు రూ. 1,35,902, వెండి కిలో రూ. 2,28,140 గా రికార్డయింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,48,810, 22 క్యారెట్లు రూ. 1,36,409, వద్ద ట్రేడ్ కాగా వెండి రూ. 2,28,520 వద్ద నిలిచింది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,48,700, 22 క్యారెట్లు రూ. 1,36,308, వెండి రూ. 2,28,330 గా నమోదైంది. చెన్నైలో ఇవే ధరలు వరుసగా రూ. 1,49,070, రూ. 1,36,648, రూ. 2,29,030గా నమోదయ్యాయి.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,017, 22 క్యారెట్లు - రూ. 13,765, 18 క్యారెట్లు - రూ. 11,535
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,017, 22 క్యారెట్లు- రూ. 13,765, 18 క్యారెట్లు - రూ. 11,263
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,017, 22 క్యారెట్లు- రూ. 13,765, 18 క్యారెట్లు - రూ. 11,263
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,017, 22 క్యారెట్లు- రూ. 13,765, 18 క్యారెట్లు - రూ. 11,263
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,017, 22 క్యారెట్లు- రూ. 13,765, 18 క్యారెట్లు - రూ. 11,263
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,017, 22 క్యారెట్లు- రూ. 13,765, 18 క్యారెట్లు - రూ. 11,263













Click it and Unblock the Notifications
