"ఇవన్నీ నిర్భయ కేసులాగే ఉన్నాయిగా.."! సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..!
2012లో ఢిల్లీలో కదులుతున్న బస్సులో నిర్బయపై జరిగిన అఘాయిత్యం దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది. దీంతో నిర్బయ చట్టం కూడా అమల్లోకి వచ్చింది. అయినా దేశ రాజధానిలో ఇప్పటికీ అలాంటి రేప్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వీటిపై పోలీసులు నామమాత్రపు చర్యలతో సరిపెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో తాజాగా చోటు చేసుకున్న రేప్, అఘాయిత్యాల ఘటనలపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా స్పందించింది.
2012లో జరిగిన నిర్భయ ఘటనల తరహాలోనే ఈ అఘాయిత్యాలు కూడా ఉన్నాయని ఆభిప్రాయపడిన సుప్రీంకోర్టు.. వీటిపై ఎవరూ పిటిషన్ దాఖలు చేయకపోయినా తానే స్వయంగా విచారణ జరపాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయా కేసుల్ని సుమోటోగా విచారణకు స్వీకరిస్తున్నట్లు ఇవాళ సంచలన ప్రకటన చేసింది. తాజాగా ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకున్న స్లీపర్ బస్సులో మైనర్‌పై సామూహిక అత్యాచారానికి గురైన కేసుతో సహా పలు ఘటనల్ని సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ సంఘటనల్నీ 2012 నిర్భయ కేసుతో బాధాకరమైన సారూప్యతలను కలిగి ఉన్నాయని వ్యాఖ్యానించింది.

2012లో ఢిల్లీలో కదులుతున్న బస్సులో 23 ఏళ్ల యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం, ఆ తర్వాత ఆమె మరణం దేశవ్యాప్తంగా భారీ నిరసనలకు దారితీసింది. ఈ కేసులో మృతురాలికే నిర్బయ అనే పేరు పెట్టడంతో పాటు నిర్భయ చట్టాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చి, ఇందుకు కారకులకు ఉరిశిక్షలు కూడా విధించారు. ఇప్పుడు మరోసారి ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నమోదైన ఇలాంటి కేసులను సుమోటోగా స్వీకరించిన జస్టిస్ జె.బి.పార్దివాలా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం.. ఆయా ఘటనలు శాంతిభద్రతల సంస్థల వైఫల్యాన్ని స్పష్టంగా ఎత్తిచూపుతున్నాయని పేర్కొంది. తగినంత లైటింగ్ లేకపోవడం, పర్యవేక్షణ లోపించడం, ఇతర పరిపాలనా సౌకర్యాలు లేకపోవడం వల్ల పార్కులు, బస్సులతో సహా బహిరంగ ప్రదేశాలు అధిక ప్రమాదకర ప్రాంతాలుగా మారడానికి అనుమతించకూడదని జస్టిస్ పార్దివాలా తెలిపారు. కేవలం సంఘీభావం వ్యక్తం చేయడం సరిపోదని, జవాబుదారీతనాన్ని నిర్ధారించడం అత్యవసరమని ఆయన తెలిపారు.














Click it and Unblock the Notifications
