మంచు మనోజ్ - మౌనిక కొత్త ప్రయాణం: ఢిల్లీలో కీలక భేటీ..!!
ప్రముఖ నటుడు మంచు మనోజ్ - మౌనిక సరి కొత్త ప్రయాణం ప్రారంభించనున్నారు. ఈ మేరకు వేగంగా అడుగులు వేస్తున్నారు. అటు సినీ పరిశ్రమలో కొనసాగుతూనే.. వ్యాపార రంగంలో ఇద్దరూ రాణించాలనే ఆలోచనతో ఉన్నారు. ఇందుకు అనుగుణంగా వినోదం- క్రీడా రంగంలో మౌలిక వసతుల నిర్వహణ పైన ఆలోచన చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ కేంద్రంగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ తో ఈ ఇద్దరి భేటీ పొలిటికల్ - సినీ వర్గాల్లో ఆసక్తి కరంగా మారుతోంది.
మనోజ్ - మౌనిక వ్యాపార పరిధి విస్తరించే ప్రణాళికల్లో బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే తాజాగా ఢిల్లీ కేంద్రంగా హిమాచల్ సదన్‌లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కవిందర్ గుప్తాను వీరు మర్యాదపూర్వకంగా కలిశారు. వినోద రంగంతో పాటు ఇతర కీలక రంగాల్లో వ్యాపారావకాశాలను అన్వేషించేందుకు ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. మనోజ్ మంచు ఇప్పటికే సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

మరోవైపు మౌనిక భూమా మంచు కూడా వ్యాపార, సామాజిక రంగాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి వినోదం, క్రీడలు, మౌలిక వసతులకు సంబంధించిన కొత్త అవకాశాలను అన్వేషిస్తున్నారు. కాగా, తాజాగా
గవర్నర్‌తో జరిగిన సమావేశంలో సినిమా, స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
కాగా.. ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికే పరిమితం కాకుండా క్రీడా విభాగానికి సంబంధించిన మౌలిక సౌకర్యాల కల్పన, భారీ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టే ఆలోచనలో ఈ ఇద్దరు ఉన్నట్లు సమాచారం. నటుడిగా క్రేజీ చిత్రాలలో బిజీగా ఉంటూనే, మరోవైపు మౌనికతో కలిసి ఎంటర్‌టైన్ మెంట్, స్పోర్ట్స్, ఇన్‌ఫ్రా రంగాల్లోకి ప్రవేశించేలా ప్రణాళికలు సిద్దం చేస్తుండటం మంచు మనోజ్ తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టులపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మనోజ్.. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో కలిసి దాదా సినిమాలో నటిస్తూనే, డేవిడ్ రెడ్డి, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రక్షక్ సినిమాలను ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఇవే కాకుండా ఈమధ్యనే 'వడ్డీకాసులవాడ' వంటి క్రేజీ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. కాగా.. ఈ ఇద్దరి తాజా అడుగులు ఆసక్తి కరంగా మారుతున్నాయి.














Click it and Unblock the Notifications
