రూపాయిని తగలబెట్టిన క్రూడాయిల్.. పతనం ప్రారంభమైందా?

అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ పెరుగుతున్న ముడి చమురు ధరలు మన రూపాయి విలువపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 107 డాలర్లకు చేరుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 7 పైసలు పడిపోయి 95.88 వద్ద ట్రేడవుతోంది.

ఇరాన్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చడంతో ఇరు దేశాల మధ్య వివాదం మరింత ముదిరింది. ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న ఈ సంక్షోభానికి ఎలాంటి తెరపడకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక శాతానికి పైగా పెరిగాయి. దీని ప్రభావం కారణంగా అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్ కూడా దాదాపు రెండు దశాబ్దాల గరిష్ట స్థాయి అయిన 5.2 శాతానికి ఎగబాకాయి.

rupee Opens Lower at 95 88 Against US Dollar as Brent Crude Prices Climb Back Above 107 Dollars
కుప్పకూలిన రూపాయి! దండెత్తిన డాలర్, సరికొత్త కనిష్టానికి కరెన్సీ
కుప్పకూలిన రూపాయి! దండెత్తిన డాలర్, సరికొత్త కనిష్టానికి కరెన్సీ

రంగంలోకి రిజర్వ్ బ్యాంక్.. మార్కెట్ నిఘా

రూపాయి విలువ మరింత పడిపోకుండా ఆర్బీఐ (RBI) రంగంలోకి దిగి మార్కెట్‌ను నిశితంగా గమనిస్తోంది. గత కొన్ని సెషన్లుగా 96 రూపాయల స్థాయి వద్ద రూపాయిని కాపాడుకునేందుకు ఆర్బీఐ ప్రయత్నిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. రూపాయికి 96.10 నుంచి 96.20 స్థాయి కీలకమైన నిరోధక ప్రాంతంగా ఉందని, ఒకవేళ 95.70 దిగువకు పడిపోతే మరింత నష్టం జరిగే అవకాశం ఉందని సీఆర్ ఫారెక్స్ అడ్వైజర్స్ ఎండీ అమిత్ పబారి తెలిపారు.

రూపాయిపై పిడుగు.. పాతాళానికి మారకపు విలువ!
రూపాయిపై పిడుగు.. పాతాళానికి మారకపు విలువ!

రానున్న రోజుల్లో కీలకమైన ఆర్థిక డేటా

అమెరికాలో త్వరలో వెలువడనున్న సెప్టెంబర్ నాన్-ఫార్మ్ పేరోల్స్ నివేదిక, ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్ దిశను నిర్దేశించనున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై తీసుకునే నిర్ణయాలు డాలర్ కరెన్సీ బలాన్ని ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు దేశీయంగా ద్రవ్య లభ్యతను నియంత్రించేందుకు ఆర్బీఐ క్యాష్ రిజర్వ్ రేషియో (CRR) పెంపు వంటి చర్యలు చేపట్టే అవకాశాలున్నట్లు డ్యూయిష్ బ్యాంక్ అంచనా వేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+