పవన్ కేబినెట్ కు రాకపోయినా వచ్చినట్లే..! కారణం చెప్పిన సర్కార్-ఆర్టీఐ ప్రశ్నకు..!

ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తరచుగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలకు హాజరు కావడం లేదు. అనారోగ్యంతో పాటు వివిధ అంశాల్ని ఇందుకు కారణాలుగా చూపుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొత్తం 57 కేబినెట్ సమావేశాలు జరిగాయి. వీటిలో ఈ ఏడాది జరిగిన సమావేశాలకూ పవన్ తరచుగా గైర్హాజరు అయ్యారు. అయినా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. పవన్ ఎందుకు కేబినెట్ కు రావడం లేదనే అంశంపై రాజకీయంగా కూడా పలు పుకార్లు వినిపించాయి.

టీడీపీలో చేరిపోయిన బొత్స మేనల్లుడు..! చంద్రబాబు కీలక హామీ?
టీడీపీలో చేరిపోయిన బొత్స మేనల్లుడు..! చంద్రబాబు కీలక హామీ?

ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా నుంచి సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ఓ ప్రశ్నకు ప్రభుత్వం ఆసక్తికరమైన జవాబు ఇచ్చినట్లు సౌత్ ఫస్ట్ న్యూస్ పోర్టల్ తెలిపింది. కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకూ జరిగిన అన్ని కేబినెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారని సాధారణ పరిపాలనాశాఖ తరపున అసిస్టెంట్ సెక్రటరీ రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఆగస్టు 14న వచ్చిన ఆర్టీఐ దరఖాస్తుకు ఆగస్టు 31న జీఏడీ కేబినెట్‌ విభాగం స్పందిస్తూ.... 2024 నుంచి 2026 ఆగస్టు 14వ తేదీ వరకు 57 సార్లు కేబినెట్ భేటీ అయినట్లు పేర్కొంది. ఇందులో మంత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ ఎన్నిసార్లు గైర్హాజరు అయ్యారన్న ప్రశ్నకు ఎవరూ గైర్హాజరు కాలేదని తెలిపింది.

Why Is Pawan Kalyan Marked Present at Cabinet Meetings Even When Absent RTI Reveals
ఆంధ్రా పేపర్ మిల్స్ పై పవన్ సీరియస్..! సమన్ల జారీకి ఆదేశం..!
ఆంధ్రా పేపర్ మిల్స్ పై పవన్ సీరియస్..! సమన్ల జారీకి ఆదేశం..!

డిప్యూటీ సీఎం హాజరు కాని సమయంలో కేబినెట్ తీసుకునే నిర్ణయాలకు ఆయన కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందా అనే ప్రశ్నకు ఏపీ బిజినెస్ రూల్స్ 2018లోని 11వ నిబంధన ప్రకారం కేబినెట్ నిర్ణయాలకు మంత్రులందరూ సమిష్టి బాధ్యత వహించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఏపీ కేబినెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్‌ హాజరు కాకపోయినా మంత్రి మండలిలో ఉన్నపుడు కేబినెట్ సమావేశాలు జరిగే తేదీలు, అజెండా వివరాలు నిర్ణీత సమయానికి ముందే మంత్రులందరికి చేరుతాయని, కేబినెట్ అనేది సమిష్టి నిర్ణయాలు తీసుకునేది కాబట్టి అందులో ఉన్నంత కాలం మంత్రులంతా ఆ నిర్ణయాలకు బాధ్యులేనని వెల్లడించారు. మంత్రులు సమావేశాలకు రాలేకపోతే సీఎంకు ముందస్తు సమాచారం ఇస్తారని అధికారులు తెలిపారు. మంత్రులు వ్యక్తిగత కారణాలు, అనారోగ్యం, విదేశీ పర్యటనల్లో ఉన్నపుడు సమావేశాలకు రారని, ఆ సమాచారం సీఎంకు ముందే అందుతుందని అలాంటి సందర్భాల్లో వాటిని గైర్హాజరుగా పరిగణించరని తెలిపారు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉందని సౌత్ ఫస్ట్ తన కథనంలో పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+