నాగ చైతన్య అడ్వెంచర్ థ్రిల్లర్ విడుదల తేదీ వెల్లడి- ఒకే నెలలో.. !!

అక్కినేని నాగ చైతన్య నటిస్తోన్న లేటెస్ట్ మూవీ.. వృషకర్మ. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. తండేల్ తర్వాత నాగ చైతన్య నటిస్తోన్న అడ్వెంచర్ బేస్డ్ మూవీ కావడం వల్ల దీనిపై హైప్ క్రియేట్ అయింది. ఇది చైతూ నటిస్తోన్న 24 మూవీ కూడా.

ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నాయి. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాపినీడు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తండేల్ మూవీ తర్వాత నాగచైతన్య నటిస్తోన్న తాజాగా సినిమా ఇదే. తండేల్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ దఫా అడ్వెంచర్ థ్రిల్లర్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పటివరకు అతను నటించని జానర్ ఇది.

Naga Chaitanya Upcoming Movie Vrushakarma Likely to release on December 3 With Supernatural Aura

ఇదివరకే ఈ చిత్రం గ్లింప్స్ కూడా విడుదల అయింది. కార్తీక్ దండు తన సినిమాలకు 'వి/వ' అక్షరంతో ప్రారంభమయ్యే టైటిల్స్‌ను పెట్టాడు. ఆయన ఇదివరకు దర్శకత్వం వహించిన విరూపాక్ష హిట్ కావడంతో అదే సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తోన్నాడు. ఈ ఫిల్మ్ లో నాగ చైతన్య పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపించబోతోన్నాడు. సిక్స్ ప్యాక్ బాడీ, స్టైలిష్ హెయిర్‌డో, కండలు తిరిగిన శరీరంతో ఈ క్యారెక్టర్ కు తగ్గట్టుగా అగ్రెసివ్ గెటప్ లో దర్శనం ఇచ్చాడు.

ఎల్ నినో ఇంపాక్ట్- కన్వెక్టివ్ క్లౌండ్స్: ఎల్లుండి నుంచి దేశవ్యాప్తంగా మరో విడత..!!
ఎల్ నినో ఇంపాక్ట్- కన్వెక్టివ్ క్లౌండ్స్: ఎల్లుండి నుంచి దేశవ్యాప్తంగా మరో విడత..!!

కార్తీక్ దండు దర్శకత్వంలో నటించడం ఇదే మొదటిసారి. ఓ పౌరాణిక హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నాడు. చీకటి శక్తులు ఆవహించిన విలన్ ఒక రహస్యమైన చిత్రాన్ని గీస్తూ కనిపించడంతో గ్లింప్లెస్ మొదలవుతుంది. సాహసోపేతమైన స్టంట్స్, యాక్షన్ సన్నివేశాలతో నిండిన పాత్ర కావడం వల్ల దానికి తగ్గట్టుగా కనిపించాడు. విలన్ గా స్పర్శ్ శ్రీవాస్తవ నటిస్తోన్నాడు. అజనీష్ బీ లోక్‌నాథ్ అందించిన మ్యూజిక్.. సినిమాను మరింత గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా మార్చింది.

మెటా న్యూ ఏఐ టూల్: 24/7.. రోజువారీ అన్ని పనులూ చేస్తుంది.. !!
మెటా న్యూ ఏఐ టూల్: 24/7.. రోజువారీ అన్ని పనులూ చేస్తుంది.. !!

తాజాగా ఈ ఫిల్మ్ విడుదల తేదీ కన్ఫర్మ్ అయింది. డిసెంబర్ 3వ తేదీన విడుదల కాబోతోంది. ఈ తేదీని యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ సాయంత్రానికి ఎస్వీసీసీ బ్యానర్ నుంచి అధికారిక ప్రకటన విడుదల కావొచ్చు. డిసెంబర్ 24వ తేదీన అక్కినేని నాగార్జున నటిస్తోన్న కింగ్ 100 కూడా విడుదల అవుతోన్న విషయం తెలిసిందే. తండ్రి సినిమా కంటే ఓ 20 రోజులు ముందే వృషకర్మ విడుదల అయ్యేలా డేట్స్ సర్దుబాటు చేసుకున్నారు. డిసెంబర్ 24 నాడే బాలయ్య దాదా కూడా విడుదల కాబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+