కాలచక్ర ఏర్పాట్లపై మంత్రి కోనేరు అసంతృప్తి
అమరావతి: కాలచక్ర ఏర్పాట్లపై మున్సిపల్ శాఖ మంత్రి కోనేరు రంగారావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాలచక్ర విషయంలో స్థానికులను విస్మరించడాన్ని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా తప్పు పట్టారు. పోలీసుల కారణంగా సందర్శకులు అగచాట్లు పడ్డారని ఆయన అన్నారు. సందర్శకులను నిర్వాహకులు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.
బౌద్ధమతం గొప్పదని, అందుకే బాబా సాహెబ్ అంబేడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించాడని ఆయన అన్నారు. దలైలామా మహా మనిషి అని ఆయన కొనియాడారు. బౌద్ధం పట్ల తనకు ఎనలేని అభిమానం ఉందని ఆయన అన్నారు. ఆదివారం నాడు ఆయన కాలచక్రను సందర్శించారు.












Click it and Unblock the Notifications
