ఎమ్యెల్యే బాబ్జీ బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్: విశాఖపట్నం-1 శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల కేసులో పరవాడ కాంగ్రెస్ శాసనసభ్యుడు గండి బాబ్జీ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. కేసుకు సంబంధించిన సరైన వివరాలు లేవని, తగిన ఆధారాలు లేవని అంటూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యారావు బాబ్జీ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సోమవారంనాడు కొట్టివేశారు.
గండి బాబ్జీ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సరైన కారణాలు లేవంటూ కింది కోర్టు ఇంతకు ముందు కొట్టివేసింది. దీంతో బాబ్జీ హైకోర్టు పిటిషన్ దాఖలు చేసుకున్నారు. విశాఖపట్నం - 1 శాసనసభా నియోజవర్గం ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై బాబ్జీ తుపాకి ఎక్కుపెట్టారనే ఆరోపణపై కేసు నమోదైంది. పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన అనారోగ్యం కారణంతో ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన విశాఖపట్నంలోని కెజిహెచ్‌లో ఉన్నారు. బాబ్జీతో కెజిహెచ్ వైద్యులు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆస్పత్రి ముందు ధర్నా కూడా చేశారు.












Click it and Unblock the Notifications