ఉచిత కరెంట్‌కే అధికారం ఇచ్చారు: రఘువీరా
హైదరాబాద్: వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తామని తాము ఇచ్చిన హామీ వల్లనే ప్రజలు తమకు అధికారం ఇచ్చారని వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. తాము రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని ఆయన సోమవారం శాసనసభలో చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వం నాలుగైదు గంటలకు మించి వ్యవసాయానికి కరెంట్ ఇవ్వలేదని ఆయన విమర్శించారు. తాము కచ్చితంగా ఏడు గంటలు వ్యవసాయానికి కరెంట్ సరఫరా చేస్తున్నామని ఆయన చెప్పారు. తాము ఏడు గంటలకు మించి తొమ్మిది గంటలు, పది గంటలు ఇస్తామని చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications