హైదరాబాద్‌లో దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీనివాస్, అతని భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక బాధల వల్లనే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శ్రీనివాస్ ఒక లేఖ రాసి పెట్టాడు. దీంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఉపాధి వెతుక్కుంటూ నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీనివాస్ కుటుంబం హైదరాబాద్ వచ్చింది. అప్పు చేసి ఇటీవల శ్రీనివాస్ చెల్లెలి పెళ్లి చేశాడు. అయితే అప్పు తీర్చలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో భార్యాభర్తలిద్దరు తనువులు చాలించారు.












Click it and Unblock the Notifications