ప్రాజెక్టుల అవినీతిపై విచారణకు టిడిపి డిమాండ్
హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల్లో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని తెలుగుదేశం శాసనసభా పక్షం (టిడియల్‌పి) ఉప నాయకుడు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవకతవకలను తాను రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. బడ్జెట్‌పై శాసనసభలో ఆయన సోమవారం చర్చల్లో పాల్గొన్నారు. పేదల డబ్బులను కాంట్రాక్టర్లపరం చేస్తున్నారని ఆయన ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
బడ్జెట్‌లో పేదలను, బలహీనవర్గాలను మరిచిపోయారని, సంక్షేమ రంగానికి కేటాయింపులే లేవని ఆయన అన్నారు. తమ పేదల పార్టీ అని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత వారిని మర్చిపోయిందని ఆయన విమర్శించారు. పేద ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆయన అన్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పేద ప్రజల ప్రాపకం కోసం తాయిలాలు ప్రకటిస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications