వైఎస్ నిరంకుశుడు: చంద్రబాబు విమర్శ
రాజమండ్రి: తెలుగుదేశం పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలపై ప్రభుత్వం పోలీసు కేసులు పెట్టడాన్ని టిడిపి అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. వైఎస్ నిరంకుశ వైఖరికి ఇది నిదర్శనమని ఆయన ఆదివారం ఇక్కడ విమర్శించారు. ఎమ్మెల్యేలపై కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో టిడిపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగనున్నాయి. దీనిపై అన్ని రాష్ట్రాల చట్టసభల్లో చర్చ జరగాలని చంద్రబాబు నాయుడు అన్నారు. చట్టసభల్లో సభ్యులు చేసిన ప్రసంగాలపై సభ వెలుపల చర్యలు తీసుకోడానికి వీల్లేదని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications