బంగారం ధర మళ్ళీ భగ్గు
ముంబై: వెండి ధర బాగా పెరిగింది. బంగారం ధర మరో సారి భగ్గుమంది. సుదీర్ఘ సెలవుల అనంతరం సోమవారంనాడు అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం వుందన్న అంచనాలతో శనివారం నాడు ముంబయ్ బులియన్ మార్కెట్‌లో పెద్ద ఎత్తున కొనుగోళ్ళు జరిగాయి. కిలో వెండిధర భారీగా 570 రూపాయలు పెరిగి 19890రూపాయలు పలికింది. కాగా10 గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర 30 రూపాయలు పెరిగి 8, 830 రూపాయలయ్యింది. మేలిమి బంగారం ధర కూడా ఇదేస్థాయిలో పెరిగి 8905 రూపాయల వద్ద ముగిసింది. కాగా న్యూఢిల్లీ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర 9000 రూపాయలను తాకి రికార్డు సృష్టించింది.












Click it and Unblock the Notifications