రోడ్డు ప్రమాదంలో 4గురు పోలీసుల మృతి
కర్నూలు: మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు సమీపంలోని రంగాపురం వద్ద అదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు పోలీసులు మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పదోన్నతి కోసం హైదరాబాద్‌లో పరీక్షలు రాసి చిత్తూరు జిల్లాకు తిరిగి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న వ్యానును క ర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ ఢీకొంది. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీసు దళానికి చెందిన కానిస్టేబుళ్ళు శంకర్, జ్యోతిరెడ్డి అక్కడికక్కడే మరణించారు. శ్రీనివాసులు, డ్రైవర్ జగన్నాధ నాయుడు చికిత్స పొందుతూ మరణించారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్న మిగితా పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు పరామర్శించారు.












Click it and Unblock the Notifications